దేవుడికే శఠగోపం.. వినాయక మండపం కబ్జా
దిశ, కూకట్ పల్లి: కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా ఏకంగా దేవుడి కోసం ఏర్పాటు చేసిన మండపాన్ని ఆక్రమించాడు ఓ ప్రబుద్ధుడు. కూకట్పల్లి సర్కిల్ శక్తిపురం పారిశ్రామికవాడలో పరిశ్రమల నిర్వాహకులు అందరూ కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించేందుకు ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. కొన్నేళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిచకపోవడంతో మండప స్థలం ఖాళీగానే ఉంటుంది. దీంతో పక్కనే ఉన్న ఓ పరిశ్రమ నిర్వాహకుడి కన్ను ఆ మండప స్థలంపై పడింది. చుట్టూ […]
దిశ, కూకట్ పల్లి: కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా ఏకంగా దేవుడి కోసం ఏర్పాటు చేసిన మండపాన్ని ఆక్రమించాడు ఓ ప్రబుద్ధుడు. కూకట్పల్లి సర్కిల్ శక్తిపురం పారిశ్రామికవాడలో పరిశ్రమల నిర్వాహకులు అందరూ కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించేందుకు ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. కొన్నేళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిచకపోవడంతో మండప స్థలం ఖాళీగానే ఉంటుంది. దీంతో పక్కనే ఉన్న ఓ పరిశ్రమ నిర్వాహకుడి కన్ను ఆ మండప స్థలంపై పడింది. చుట్టూ రేకులు ఏర్పాటుచేసి తన పరిశ్రమలో ఉంటున్న కూలీల కోసం షెడ్డును ఏర్పాటు చేశాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
నవరాత్రుల్లో గణనాథుడు కొలువు దీరి పూజలందుకున్న వినాయక మం డపం నేడు ఓ పరిశ్రమ యజమాని చేతిలో కబ్జాకు గురైంది. సదరు పరిశ్రమ యజమాని ఏకంగా దానికి చుట్టూ రేకులు ఏర్పాటు చేసి ఓ గది లా మార్చి తన వద్ద పని చేస్తున్న కార్మికులను ఉంచడంతో పాటు మండపం ఉన్న ప్రాంతాన్ని తన పరిశ్రమ నిర్వహణకు వినియోగించుకుంటున్నాడు. మండపం, రోడ్డు కబ్జాకు గురైందని స్థానికులు కూకట్ పల్లి సర్కిల్ అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ప్రశాంత్ నగర్ శక్తిపురం పారిశ్రామిక వాడలో గత కొన్నేళ్ల క్రితం పరిశ్రమల నిర్వాహకులు, స్థానికులు వినాయక నవరాత్రుల్లో గణనాథుడిని ప్రతిష్ఠించడానికి ఓ మండపాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని ఏండ్ల వరకు వినాయక పూజలు నిర్వహించిన వారు కొంత కాలంగా వదిలేశారు. ఇదే అదునుగా భావించిన మండపానికి ఆనుకుని ప్లాట్ నంబర్ 25లో ఉన్న పరిశ్రమ నిర్వాహకుడు మండపం చుట్టూ రేకులు ఏర్పాటు చేశాడు. అందులో తన కార్మికులను నివాసం ఉండేందుకు ఏర్పాటు చేశా డు. మండపం ముందు భాగం, సీసీ రోడ్డును పూర్తిగా కబ్జా చేసి తన పరిశ్రమ కోసం వినియోగిస్తున్నాడు. రోడ్డు, మండపాన్ని కబ్జా చేసిన విషయమై స్థానికులు 2020 నవంబర్ 11న కూకట్ పల్లి సర్కిల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు అధికారులు కబ్జాకు గురైన మండపం గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.