పొలానికి పోవాలంటే.. ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే!
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల రైతుల బాధలు వర్ణాణాతీతం. గతంలో చెరువులో నీళ్లు లేకపోవడంతో తమ బావుల దగ్గరకు చెరువులోనే వెళ్లేవారు. ఇప్పుడు వర్షాలు భారీ కురుస్తుండటం చెరువు నిండింది. అలుగు ఉరకలెత్తుతోంది. సమీప పొలాలు నీట మునిగాయి. పొలం పనుల కోసం వెళ్దామంటే.. రైతులకు దారి లేకపాయే. పక్క నున్న రైతుల పొలం నుంచి పోదామనుకుంటే వారు వెళ్లనీయడం లేదు. దీంతో చేసేదిలేక రైతులు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించారు. చెరువు […]
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల రైతుల బాధలు వర్ణాణాతీతం. గతంలో చెరువులో నీళ్లు లేకపోవడంతో తమ బావుల దగ్గరకు చెరువులోనే వెళ్లేవారు. ఇప్పుడు వర్షాలు భారీ కురుస్తుండటం చెరువు నిండింది. అలుగు ఉరకలెత్తుతోంది. సమీప పొలాలు నీట మునిగాయి. పొలం పనుల కోసం వెళ్దామంటే.. రైతులకు దారి లేకపాయే. పక్క నున్న రైతుల పొలం నుంచి పోదామనుకుంటే వారు వెళ్లనీయడం లేదు. దీంతో చేసేదిలేక రైతులు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించారు. చెరువు కాలువ మధ్యలో రెండు తాళ్లు కట్టి.. రెండిటి మధ్యలో ట్రాక్టర్ ట్యూబ్ పై కూర్చొని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూలీలు రోజు వ్యవసాయ పనులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రోజు వ్యవసాయ పనులకు వెళ్లడం భయంగా ఉందని రైతులు ఆందోలన వ్యక్తం చేశారు.