ఆరేళ్లల్లో కోటి 32 లక్షల ఉద్యోగాలు

దిశ, కామారెడ్డి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఆరు ఏళ్లల్లో కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వ్యాఖ్యానించారు. గురువారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో కోటి 12 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గడిచిన ఆరేళ్లల్లో ప్రభుత్వం కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని, సాగర్ ఎన్నికల కోడ్ ముగియగానే మరొక 55 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ […]

Update: 2021-04-02 04:36 GMT

దిశ, కామారెడ్డి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఆరు ఏళ్లల్లో కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వ్యాఖ్యానించారు. గురువారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో కోటి 12 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గడిచిన ఆరేళ్లల్లో ప్రభుత్వం కోటి 32 లక్షల 500 ఉద్యోగాలు ఇచ్చిందని, సాగర్ ఎన్నికల కోడ్ ముగియగానే మరొక 55 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుందని పేర్కొన్నారు.

గంప గోవర్ధన్ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కోటి 32 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. సునీల్ లాంటి నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags:    

Similar News