గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను తరలిస్తే ఊరుకోం.. వ్యాపారులు హెచ్చరిక
దిశ, ఎల్బీనగర్: సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మించాలనుకుంటే గుర్రపు పందాలు ఆడే రేస్ కోర్స్‌ను ఖాళీ చేయించుకోండి, లేదా చంచల్‌గూడ్ జైలును తరలించి అక్కడ నిర్మించుకోండి కానీ 35 ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్న మమ్మల్ని ఖాళీ చేయమంటే ఊరుకునేది లేదని గడ్డి అన్నారం పండ్డ మార్కెట్ వ్యాపారాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. గత కొన్నెండ్లుగా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతకంటే ముందు మలక్‌పేట్ రేస్ కోర్సును తరలించి […]
దిశ, ఎల్బీనగర్: సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మించాలనుకుంటే గుర్రపు పందాలు ఆడే రేస్ కోర్స్‌ను ఖాళీ చేయించుకోండి, లేదా చంచల్‌గూడ్ జైలును తరలించి అక్కడ నిర్మించుకోండి కానీ 35 ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్న మమ్మల్ని ఖాళీ చేయమంటే ఊరుకునేది లేదని గడ్డి అన్నారం పండ్డ మార్కెట్ వ్యాపారాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. గత కొన్నెండ్లుగా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతకంటే ముందు మలక్‌పేట్ రేస్ కోర్సును తరలించి అసుప్రతి నిర్మిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తరువాత చంచల్‌గూడ జైలును తరలిస్తామన్నారు. అదీ వీలుకాకపోవడంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించాలని నిర్నియించాలరు. దీంతో మొదట కొంతకాలం కొత్తపేట కూరగాయా మార్కెట్‌కు తరలించారు. అక్కడ స్థలం సరిపోకపోవడంతో మళ్లీ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కే తరలించారు. గత ఏడాది కొంత మంది వ్యాపారులను ఒప్పించి కొహెడలో తాత్కాలిక షెడ్లను నిర్మించి అక్కడికి తరలించారు. ఆ ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొహెడలోని షెడ్లు కూప్పకూలిపోవడంతో తిరిగి మరలా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కే తరలించారు. ఇలా ప్రతిసారి ప్రభుత్వం తమను ఇక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నిస్తుండడంతో వ్యాపారులు విసిగిపోతున్నారు.
35 ఏండ్లగా ఇక్కడే వ్యాపారం
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో గడ్డ అన్నారం పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు. 22 ఎకరాల ఈ మార్కెట్ స్థలాంలో టెలిఫోన్ ఎక్చెంజ్ కోసం 4 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం 18 ఎకరాల స్థలంలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కొనసాగుతుంది. ఇక్కడి వ్యాపారులు దాదాపు 35 ఏండ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాది పొందుతున్నారు. దీంతో వారంతా ఇక్కడి నుంచి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.
తెరపైకి మలక్‌పేట్ రేస్ కోర్స్
2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న అనంతరం మలక్‌పేట్ రేస్ కోర్స్‌ను తరలించి ఆసుప్రతి నిర్మిస్తామని ప్రకటించారు. ఆ విషయంతో ఏమైందో ఏమో గానీ తరువాత చంచల్‌గూడ జైలును తరలించి హాస్పటల్ నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం గడ్డ అన్నారం పండ్ల మార్కట్‌ను ఎంపిక చేయడంతో వ్యాపారులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడని, జూదగాళ్ల అడ్డగా మారిన మలక్‌పేట్ రేస్ కోర్స్‌ను నగరానికి దూరంగా తరలించి అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
50 వేల మందికి జీవనోపాది
చిన్న పండ్ల వ్యాపారుల నుంచి మొదలుకొని కమీషన్ ఏజెంట్ల వరకు, హామాలీ, ఆటో డ్రైవర్లు ఇలా సుమారు 50 వేల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది పొందుతున్నారు. మరెక్కడో బాట సింగారమో, కొహెడకో తరలిస్తే చిన్నచిన్న వ్యాపారులతో పాటు ఇక్కడ పని చేసే కార్మికులు రోడ్డున పడతారు. దంతో రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. అప్పుడు పండ్ల హోల్‌సేల్‌గా విక్రయించడానికి వచ్చిన రైతులకు నగరానికి దూరంగా తరలించడం
సెక్కూరీటి ఉండదు.
23లోగా ఖాళీ చేయాలని హుకుం
ఈ నెల 23వ తేదీలోగా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఖాళీ చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులకు హుకుం జారీ చేశారు. వ్యాపారులు ఖాళీ చేయడానికి ససేమిరా అనడంతో మరోసారి సోమవారం వ్యాపారులతో చర్చలు జరపాలని నిర్నయించారు.
న్యాయ పోరాటం చేస్తాం: షౌకత్, పండ్ల వ్యాపారి
మా తండ్రుల కాలం నుంచి 35 ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం. నగరానికి దగ్గరలో ఉండడంతో ప్రజలకు చౌక ధరలలో పండ్లు లభిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 35వేల మంది పండ్ల వ్యాపారంతో ఉపాది పొందుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మించేందుకు అనేక స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించుకోండ. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం