వెయ్యి డప్పులు, లక్షగొంతులతో పాదయాత్ర చేస్తా : గద్దర్
దిశ, హుస్నాబాద్: వెయ్యిడప్పులు, లక్ష గొంతులతో మహాపాదయాత్ర చేస్తామని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కవులు, కళాకారులు, మేధావులు, అభ్యుదయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. భారత రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై నేటి యువత కంకణబద్ధులు కావాలన్నారు. భారత రాజ్యాంగం అందించిన ఫలాలను అక్షరజ్ఞానులందరూ నమసమాజ […]
దిశ, హుస్నాబాద్: వెయ్యిడప్పులు, లక్ష గొంతులతో మహాపాదయాత్ర చేస్తామని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కవులు, కళాకారులు, మేధావులు, అభ్యుదయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. భారత రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై నేటి యువత కంకణబద్ధులు కావాలన్నారు. భారత రాజ్యాంగం అందించిన ఫలాలను అక్షరజ్ఞానులందరూ నమసమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
జానపదం, అభ్యుదయం, విప్లవం, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కళలు, సంస్కృతి సంప్రదాయాలపై ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నేడు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన అట్టడుగు, అనగారిన వర్గాలు అక్షరాస్యతకు అందనంత దూరంలో ఉన్నారన్నారు. పాలకవర్గాల రాజకీయాధికారం పౌరసమాజం భావజాలంలో బాగుంటుందన్నారు. పాట, శబ్దం రెండు ఈ భావజాలంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తోందన్నారు. వెయ్యి డప్పులు, లక్ష గొంతుకలతో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో పాట నుండి పాటకు పాదయాత్రను చేపట్టి ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి వినతి పత్రాలు సమర్పించబోతున్నామని గద్దర్ వెల్లడించారు.