తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగనుందని, దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ సాధారణ వర్షపాతం 7 మీమీ నుంచి 13 మీమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 123.1మీమీ వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగనుందని, దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇవాళ సాధారణ వర్షపాతం 7 మీమీ నుంచి 13 మీమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 123.1మీమీ వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 64.5మీమీ నుంచి 115మీమీ వర్షపాతం నమోదవ్వగా.. వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలో 2.4 నుంచి 15.5 వర్షపాతం నమోదైంది.