మరో మూడ్రోజులు వర్షాలు..

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న రెండ్రోజుల్లో తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, వాయుగుండగా మారే అవకాశం ఉందని సమాచారం. దీనివలన రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి ఓ […]

Update: 2020-10-07 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న రెండ్రోజుల్లో తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, వాయుగుండగా మారే అవకాశం ఉందని సమాచారం. దీనివలన రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News