పెట్రో మంట.. 16 రోజుల్లో రూ. 8పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సెగలు కక్కుతున్నాయి. కరోనా ఆపత్కాలంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్యుడికి చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూన్ 7న మళ్లీ రోజువారీ సవరింపులు అమలైనప్పటి నుంచి వరుసగా ప్రతి రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా, సోమవారమూ వీటి ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరగడంతో రూ. 79.56కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 58 పెరిగి రూ. 78.85కి చేరింది. ముంబయిలో లీటర్ […]
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సెగలు కక్కుతున్నాయి. కరోనా ఆపత్కాలంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్యుడికి చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూన్ 7న మళ్లీ రోజువారీ సవరింపులు అమలైనప్పటి నుంచి వరుసగా ప్రతి రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా, సోమవారమూ వీటి ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరగడంతో రూ. 79.56కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 58 పెరిగి రూ. 78.85కి చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 86.36కు, డీజిల్ ధర 77.24కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.87కు, డీజిల్ ధర రూ. 76.30కు చేరింది. దీంతో ఈ16 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 8.30, డీజిల్‌పై రూ. 9.22లు పెరగడం గమనార్హం.