మాస్కులు లేని వారి నుంచి ఎన్ని కోట్లు వసూలు చేశారో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ. 31 కోట్లు వ‌సూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మకాల‌పై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసుల ఫైల్‌ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ చేసిన నేపథ్యంలో ఈ నివేదికను కోర్టుకు ఇచ్చారు. హైకోర్టులో సోమవారం విచార‌ణ‌కు హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ […]

Update: 2021-05-17 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ. 31 కోట్లు వ‌సూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మకాల‌పై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసుల ఫైల్‌ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ చేసిన నేపథ్యంలో ఈ నివేదికను కోర్టుకు ఇచ్చారు. హైకోర్టులో సోమవారం విచార‌ణ‌కు హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ సీపీలు హాజ‌ర‌య్యారు. అలాగే, తెలంగాణ‌లో లాక్‌డౌన్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక అందించారు. ఇందులో భాగంగా.. భౌతిక దూరం పాటించ‌నందుకు మొత్తం 22,560 కేసులు న‌మోదయ్యాయని డీజీపీ న్యాయస్థానానికి వివరించారు. ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు చేశామ‌ని, మాస్కులు ధ‌రించ‌ని వారికి మొత్తం రూ. 31 కోట్ల జ‌రిమానా విధించామ‌ని తెలిపారు.

 

Tags:    

Similar News