ఒక్కసారి స్నేహం చేస్తే..ఇక దాంపత్యమే
దిశ వెబ్ డెస్క్: ఇళయరాజా మ్యూజిక్.. బాలు వాయిస్ మ్యాజిక్ మధ్య లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంది. ఎన్ని గొడవలు వచ్చినా.. ఎన్ని అభిప్రాయ బేధాలు ఎదురైనా సరే ఆ స్నేహం అలాగే కొనసాగింది. బాలు పాట అంటే ఇళయరాజా కు ఇష్టం.. ఇళయరాజా మ్యూజిక్ అంటే బాలుకు బహు ఇష్టం.. ఎంతలా అంటే కొన్ని రోజుల స్నేహ విరహాన్ని కూడా తట్టుకోలేక పోయారు ఆయన. ఇళయరాజా ఇలా పిలిచాడో లేదో అలా వాలిపోయి వెంటనే కౌగిలించుకున్నారు. […]
దిశ వెబ్ డెస్క్:
ఇళయరాజా మ్యూజిక్.. బాలు వాయిస్ మ్యాజిక్ మధ్య లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంది. ఎన్ని గొడవలు వచ్చినా.. ఎన్ని అభిప్రాయ బేధాలు ఎదురైనా సరే ఆ స్నేహం అలాగే కొనసాగింది. బాలు పాట అంటే ఇళయరాజా కు ఇష్టం.. ఇళయరాజా మ్యూజిక్ అంటే బాలుకు బహు ఇష్టం.. ఎంతలా అంటే కొన్ని రోజుల స్నేహ విరహాన్ని కూడా తట్టుకోలేక పోయారు ఆయన. ఇళయరాజా ఇలా పిలిచాడో లేదో అలా వాలిపోయి వెంటనే కౌగిలించుకున్నారు. బాలు స్నేహం విలువ తెలిసిన మనిషి. అందుకే ఆయన అంటుంటారు.. ఒక్కసారి స్నేహం చేశాక ఇంక దాంపత్యమే అని. ఆ బంధం ఎప్పటికీ విడిపోదు అని. స్నేహం చేశాక అవతలి వారిలో చాలా తప్పులు కనిపిస్తాయి.. చాలా ఇబ్బందులు కనపడతాయి.. చేతనైతే మార్చడానికి ప్రయత్నించాలి.. చేతకాకపోతే భరించాలి తప్పా.. స్నేహాన్ని మాత్రం వదులుకోకూడదు అని..