ఫ్రెంచ్ ఓపెన్‌లో జిదాన్‌సెక్ సంచలనం

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. స్లోవేనియాకు చెందిన తమార జిదాన్‌సెక్ క్వార్టర్‌ఫైనల్‌లో పౌలా బడోసాను 7-5, 4-6, 8-6 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరుకుంది. గతంలో ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ రెండో రౌండ్ కూడా దాటని జిదాన్‌సెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా సెమీఫైనల్ చేరింది. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో స్లోవేనియా క్రీడాకారికి సెమీస్ చేరడం ఇదే తొలిసారి. కాగా, గతంలో స్నోబోర్డ్ క్రీడాకారిణిగా పలు ఈవెంట్లలో పాల్గొన్న జిదాన్‌సెక్ ఫ్రెంచ్ ఓపెన్ […]

Update: 2021-06-08 20:28 GMT

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. స్లోవేనియాకు చెందిన తమార జిదాన్‌సెక్ క్వార్టర్‌ఫైనల్‌లో పౌలా బడోసాను 7-5, 4-6, 8-6 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరుకుంది. గతంలో ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ రెండో రౌండ్ కూడా దాటని జిదాన్‌సెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా సెమీఫైనల్ చేరింది. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో స్లోవేనియా క్రీడాకారికి సెమీస్ చేరడం ఇదే తొలిసారి. కాగా, గతంలో స్నోబోర్డ్ క్రీడాకారిణిగా పలు ఈవెంట్లలో పాల్గొన్న జిదాన్‌సెక్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది. తొలి సెట్‌లో జిదాన్‌సెక్ గెలిచినా రెండో సెట్‌లో పౌలా ఆధిపత్యం చెలాయించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో సెట్ టై బ్రేకర్ లేకపోవడంతో ఆట 8-6 వద్ద ముగిసింది. ఆ సెట్ జిదాన్‌సెక్ చేజిక్కించుకొని సెమీస్‌లో ప్రవేశించింది.

మరో క్వార్టర్ ఫైనల్‌లో ప్లవీచెంకోవా 6-7(2-7), 6-2, 9-7 తేడాతో ఎలేనా రిబకీనాపై విజయం సాధించి సెమీస్ చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో సెరేనా విలియమ్స్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరిన రిబకీనా మొదటి సెట్ గెలిచింది. కానీ ఆ తర్వాత పట్టుకోల్పోయింది. చివరి సెట్‌లో తొలుత ప్లవీచెంకోవా సర్వీస్ బ్రేక్ చేసి ముందుకు వెళ్లినా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. సెమీస్‌లో ప్లవీచెంకోవా, తమార జిదదాన్‌సెక్‌తో తలపడనున్నది. ఇక మహిళల ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇగ ష్వామ్‌టెస్ 6-3, 6-4 తేడాతో కోస్త్యుక్ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మెన్స్ డబుల్స్‌లో 6వ ర్యాంక్ జోడీ హెర్బర్ట్-మహట్, 2వ ర్యాంకర్ జోడి కబల్-ఫరాహ్ సెమీస్ చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో 14వ ర్యాంకర్ మాటెక్ సాండ్స్-ఇగ ష్వామ్‌టెక్ జోడి, 2వ ర్యాంక్ సినియాకోవా-క్రెజికోవా జోడి సెమీస్‌లోకి ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్‌లో 6వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 6-1, 6-1 తేడాతో డేవిడోవిచ్‌పై సునాయాసంగా నెగ్గి సెమీస్ చేరుకున్నాడు.

Tags:    

Similar News