శిల్పారామంలో ఫ్రీడం ఫైటర్స్ పోట్‌రైట్ ఎగ్జిబిషన్

దిశ, శేరిలింగంపల్లి: ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మాదాపూర్ శిల్పారామంలో దక్షిణ మండలం సాంస్కృతిక కేంద్రం నాగపూర్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.‌ ఈ సందర్బంగా శనివారం స్వతంత్ర సమరయోధుల పై పలువురు కళాకారులు వేసిన పోట్‌రైట్ రంగోలి ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది. మాదాపూర్ శిల్పారామం ఎత్నిక్ హాల్‌లో వారం రోజుల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ముంబై నుంచి వచ్చిన […]

Update: 2021-08-14 09:30 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మాదాపూర్ శిల్పారామంలో దక్షిణ మండలం సాంస్కృతిక కేంద్రం నాగపూర్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.‌ ఈ సందర్బంగా శనివారం స్వతంత్ర సమరయోధుల పై పలువురు కళాకారులు వేసిన పోట్‌రైట్ రంగోలి ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది. మాదాపూర్ శిల్పారామం ఎత్నిక్ హాల్‌లో వారం రోజుల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ముంబై నుంచి వచ్చిన కళాకారులు సిద్ధేషు అనంత్, రోషన్ రమేష్, నేహా నారాయణ్, శృతి సుహాస్‌లు స్వతంత్ర్య సమరయోధుల ఛాయా చిత్రాలను రంగు రంగుల ముగ్గులతో కళాత్మక ఉట్టిపడే విధంగా వేశారు. ఈ ఛాయా చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News