ఆదివారం బంపర్ ఆఫర్.. తెలంగాణలో వారికి గుడ్ న్యూస్
దిశ, నర్సంపేట : సాధారణంగా బస్‌లో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరి. కానీ, ఆదివారం (నవంబర్ 14న) మాత్రం టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం చేయవచ్చు. అయితే, ఈ అవకాశం 15 సంవత్సరాల లోపున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్‌టీసీ) మరో నిర్ణయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు(నవంబర్ 14 సందర్భంగా) పిల్లలందరికీ ఉచిత ప్రయాణ […]
దిశ, నర్సంపేట : సాధారణంగా బస్‌లో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరి. కానీ, ఆదివారం (నవంబర్ 14న) మాత్రం టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం చేయవచ్చు. అయితే, ఈ అవకాశం 15 సంవత్సరాల లోపున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్‌టీసీ) మరో నిర్ణయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు(నవంబర్ 14 సందర్భంగా) పిల్లలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్‌టీసీ అధికారులు నిర్ణయించారు. ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 12 గంటల వరకు 15 ఏండ్ల లోపు పిల్లలకు అన్ని ఆర్‌టీసీ బస్సులలో టికెట్ లేకుండా ఉచితంగా సేవలు అందించనున్నట్లు నర్సంపేట ఆర్‌టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్‌లోని నెహ్రూ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హృదయ స్పందన సేవా సొసైటీలోని పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సీఆర్సీ దేవేందర్, ఏడీసీ సాంబయ్య, నారాయణ, ఏఎం.రావు, వేముల రవి, అశోక్ రెడ్డి, యాకూబ్ పాషా, సాంబయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.