ఆ దేశంలో నేటి నుంచి మళ్లీ లాక్‌డౌన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో కరోనాకు అడ్డుకట్ట వేయడం ఎలా? అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. మళ్లీ కేసులు పెరుగుతుండటంతో.. ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 19 నుంచి […]

Update: 2021-03-19 00:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో కరోనాకు అడ్డుకట్ట వేయడం ఎలా? అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. మళ్లీ కేసులు పెరుగుతుండటంతో.. ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

ఈ క్రమంలో పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 19 నుంచి నెల రోజుల పాటు ఫ్రాన్స్‌లోని 16 ఏరియాల్లో లాక్‌డౌన్ విధించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని, ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి బయటికి రావొచ్చని, కానీ అనుమతి పత్రం కలిగి ఉండాలని పేర్కొంది.

ప్రజలు తమ ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంను అమలు చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఇక సాయంత్రం 7 నుంచి రాత్రి కర్ఫ్యూ ఉంటుందని పేర్కొంది.

Tags:    

Similar News