భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడి సంఘీభావం..

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద ప్రమాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్ మాక్రాన్ స్పందించారు. దౌలిగంగా వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఫ్రాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. మా ఆలోచనలు బాధితులు, వారి కుటుంబాలతో కలిసి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, నందా దేవి హిమానీ నది పై భాగంలో కొండచరియలు విరిగిపడటంతో ఆనకట్ట తెగిపోయింది. దీంతో ఉత్తరఖండ్‌లోని రిషిగంగా, ధౌలిగంగా మరియు అలకానంద నదుల్లో నీటి మట్టం […]

Update: 2021-02-07 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద ప్రమాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్ మాక్రాన్ స్పందించారు. దౌలిగంగా వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఫ్రాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. మా ఆలోచనలు బాధితులు, వారి కుటుంబాలతో కలిసి ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే, నందా దేవి హిమానీ నది పై భాగంలో కొండచరియలు విరిగిపడటంతో ఆనకట్ట తెగిపోయింది. దీంతో ఉత్తరఖండ్‌లోని రిషిగంగా, ధౌలిగంగా మరియు అలకానంద నదుల్లో నీటి మట్టం పెరిగి వరదలు సంభవించాయి.కాగా, ఈ ప్రమాదంలో 150 మందికి పైగా కార్మికులు మరిణించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News