భారత్‌లో మరో నాలుగు స్ట్రెయిన్ కేసులు 

న్యూఢిల్లీ : భారత్‌లో మరో నాలుగు స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇందులో మూడు కేసులు బెంగళూరులోని ల్యాబ్, మరొక కేసు హైదరాబాద్‌లోని సీసీఎంబీలో వెలుగుచూసినట్టు సమాచారం. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 29కు చేరింది. యూకేలో తొలిసారిగా కనిపించిన ఈ వేరియంట్ 70శాతం వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన వారిలో తొలిసారిగా ఈ […]

Update: 2021-01-01 07:13 GMT

న్యూఢిల్లీ : భారత్‌లో మరో నాలుగు స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇందులో మూడు కేసులు బెంగళూరులోని ల్యాబ్, మరొక కేసు హైదరాబాద్‌లోని సీసీఎంబీలో వెలుగుచూసినట్టు సమాచారం. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 29కు చేరింది. యూకేలో తొలిసారిగా కనిపించిన ఈ వేరియంట్ 70శాతం వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన వారిలో తొలిసారిగా ఈ స్ట్రెయిన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఆ దేశం నుంచి వచ్చినవారిలో కరోనా పాజిటివ్ తేలిన వారి నమూనాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పది ల్యాబరేటరీల్లో పరీక్షిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు ద్వారా కొత్త వేరియంట్ కేసును గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని ఎన్‌సీడీసీ, ఐజీఐబీలలో కలిపి 10 కేసులు, కోల్‌కతాలోని ఎన్ఐబీఎంజీలో ఒక కేసు, పూణెలోని ఎన్ఐవీలో ఐదుకేసులు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో మూడు కేసులు, బెంగళూరులోని నిమ్హాన్స్‌లో 10 కేసులు రిపోర్ట్ అయ్యాయి.

 

Tags:    

Similar News