నలుగురు భారతీయులకు దక్షిణాఫ్రికా స్ట్రెయిన్
న్యూఢిల్లీ: మనదేశంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా వైరస్ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. దేశంలో నాలుగు దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయని, ఒక బ్రెజిల్ కరోనా స్ట్రెయిన్ నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. వీరంత విదేశాల్లో నుంచి ఇక్కడకు వచ్చినవారేనని తెలిపింది. జనవరిలో అంగోలా నుంచి ఒకరు, టాంజానియా నుంచి ఒకరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఇక్కడకు తిరిగి వచ్చినవారిలో దక్షిణాఫ్రికా రకం కరోనా […]
న్యూఢిల్లీ: మనదేశంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా వైరస్ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. దేశంలో నాలుగు దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయని, ఒక బ్రెజిల్ కరోనా స్ట్రెయిన్ నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. వీరంత విదేశాల్లో నుంచి ఇక్కడకు వచ్చినవారేనని తెలిపింది. జనవరిలో అంగోలా నుంచి ఒకరు, టాంజానియా నుంచి ఒకరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఇక్కడకు తిరిగి వచ్చినవారిలో దక్షిణాఫ్రికా రకం కరోనా వెలుగుచూసిందని వివరించింది. ఈ నలుగురి కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచినట్టు పేర్కొంది.
ఈ నెల తొలివారంలో బ్రెజిల్ వేరియంట్ కేసును గుర్తించినట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. కొత్త రకం వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు యూకే స్ట్రెయిన్‌కు భిన్నమైనవని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో 187 మందిలో యూకే వేరియంట్‌ను గుర్తించామని వివరించారు. చైనాలో తొలిసారి గుర్తించిన కరోనావైరస్ కంటే బ్రిటన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, యూకే స్ట్రెయిన్ కంటే దక్షిణాఫ్రికా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్ వ్యాధినిరోధక కణాలకు మరింత గట్టి సవాల్‌ను విసురుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
17 రాష్ట్రాలు, యూటీల్లో కరోనా మరణాల్లేవ్
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నెలలో నాలుగుసార్లు కరోనా కేసులు పదివేల లోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9121 కేసులు రిపోర్ట్ అయ్యాయని, మొత్తం కేసులు 1,09,25,710కు చేరాయని కేంద్రం తెలిపింది. కాగా, 81 కరోనా మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరించింది. కరోనా మరణాలు 100లోపు నమోదవ్వడం ఇది పదోసారి కావడం గమనార్హం. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణమూ చోటుచేసుకోలేదని మంగళవారం ఉదయం వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో ఒక్క కేసూ రిపోర్ట్ కాలేదని వివరించింది.