ప్రైవేటు ఫీజుల దందాపై విజిలెన్స్​ విచారణ చేపట్టాలి

దిశ, న్యూస్​ బ్యూరో: `ప్రైవేటు స్కూళ్లలో అధిక మొత్తంలో ఫీజుల వసూలు, అవకతవకలపై డైరెక్టర్​ జనరల్​ విజిలెన్స్​తో విచారణ చేయించాలని ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ కోరింది. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై ​సౌందర్ రాజన్‌కు ఫోరం కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. లాక్​డౌన్​లో స్కూళ్లు నడవకపోయినా ఫీజలు వసూలు చేస్తున్నారని, ఆన్​లైన్​ క్లాసుల పేరుతో కొనుగోళ్లు చేయించేందుకు తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ కోసం […]

Update: 2020-07-10 08:36 GMT

దిశ, న్యూస్​ బ్యూరో: 'ప్రైవేటు స్కూళ్లలో అధిక మొత్తంలో ఫీజుల వసూలు, అవకతవకలపై డైరెక్టర్​ జనరల్​ విజిలెన్స్​తో విచారణ చేయించాలని ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ కోరింది. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై ​సౌందర్ రాజన్‌కు ఫోరం కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. లాక్​డౌన్​లో స్కూళ్లు నడవకపోయినా ఫీజలు వసూలు చేస్తున్నారని, ఆన్​లైన్​ క్లాసుల పేరుతో కొనుగోళ్లు చేయించేందుకు తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను ప్రైవేటు పాఠశాలలు అమలు చేయడం లేదన్నారు. 2017లో ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఇచ్చిన నివేదిక మరుగునపడిపోయిందని, ప్రైవేటు స్కూళ్ల దందాపై ఎన్నో అర్జీలు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఫీజులను నియంత్రించే స్థాయిలో జిల్లా విద్యాశాఖకు అధికారాలు లేవని, గవర్నర్​ కల్పించుకుని తగిన చర్యలు చేపట్టాలని పద్మనాభరెడ్డి కోరారు.

Tags:    

Similar News