కేంద్ర మాజీ మంత్రి బచి సింగ్ రావత్ కన్నుమూత
డెహ్రాడూన్ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బచి సింగ్ రావత్ (71) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా శ్వాసకోస (లంగ్స్ ఇన్‌ఫెక్షన్) సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన రిషికేష్ లోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయన ఆదివారం ఉదయమే ఏయిమ్స్ లో చేరారు. బచి సింగ్ రావత్ మృతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సంతాపాన్ని ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని అల్మోరా-పితోర్‌గఢ్ నుంచి నాలుగు సార్లు […]
డెహ్రాడూన్ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బచి సింగ్ రావత్ (71) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా శ్వాసకోస (లంగ్స్ ఇన్‌ఫెక్షన్) సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన రిషికేష్ లోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయన ఆదివారం ఉదయమే ఏయిమ్స్ లో చేరారు. బచి సింగ్ రావత్ మృతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సంతాపాన్ని ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని అల్మోరా-పితోర్‌గఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన దివంగత ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. బీజేపీ అగ్ర నాయకులు మురళీ మనోహర్ జోషికి ఆయన అత్యంత సన్నిహితులు.