బీజేపీలోకి స్వామిగౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు చర్చలు సాగించారు. ఇప్పటికే టీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న స్వామిగౌడ్ పలుమార్లు బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఆయనకు అనుకూల సంకేతాలు రావడంతో కొద్దిగా శాంతించారు. కానీ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడం, తనను పట్టించుకోవడం లేదనే కారణంతో స్వామిగౌడ్ పార్టీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు చర్చలు సాగించారు. ఇప్పటికే టీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న స్వామిగౌడ్ పలుమార్లు బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఆయనకు అనుకూల సంకేతాలు రావడంతో కొద్దిగా శాంతించారు. కానీ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడం, తనను పట్టించుకోవడం లేదనే కారణంతో స్వామిగౌడ్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. మూడ్రోజలు కిందట రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వామిగౌడ్‌ను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే స్వామిగౌడ్ బుధవారం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలతో స్వామిగౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ పెద్దలు కీలక హామీ ఇచ్చినట్టు ముఖ్యవర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. స్వామిగౌడ్ ఢిల్లీలోనే నేడు సాయంత్రం కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. స్వామిగౌడ్ బీజేపీలో చేరితో ఉద్యోగ వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని కమలం శ్రేణులు భావిస్తున్నారు.