ఈనెల 29న మాజీ ప్రజాప్రతినిధుల మహాసభ
దిశ, ముధోల్: ఈనెల 29న జరిగే మాజీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఉపాధ్యక్షులు ఆనంద్ రావు పాటిల్ అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో మాజీ ప్రజా ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. మాజీ ప్రజాప్రతినిధులకు హెల్త్ కార్డులు, పెన్షన్, బీద మాజీ ప్రజాప్రతినిధులకు ఇండ్లు, హైదరాబాద్ నగరంలో తమకు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో […]
దిశ, ముధోల్: ఈనెల 29న జరిగే మాజీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఉపాధ్యక్షులు ఆనంద్ రావు పాటిల్ అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో మాజీ ప్రజా ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. మాజీ ప్రజాప్రతినిధులకు హెల్త్ కార్డులు, పెన్షన్, బీద మాజీ ప్రజాప్రతినిధులకు ఇండ్లు, హైదరాబాద్ నగరంలో తమకు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగే సభకు మాజీ ప్రజా ప్రతినిధులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో తమ సమస్యలను పరిష్కరించుకొవడానికి కార్యాచరణ, ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాలపై చర్చించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా మాజీ ప్రజా ప్రతినిధులు రామచందర్ రెడ్డి, పండిత్ పాటిల్, చిన్నయ్య, హనుమండ్లు, చిన్నన్న, భీమ్రావ్ డోంగ్రే, రజాక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.