మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు జైలు శిక్ష అనుభవించడం అరుదు. కానీ, ఓ దేశ మాజీ ప్రధానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఓ కేసులో దోషిగా తెలడంతో అక్కడి న్యాయస్థానం 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌.. 1 ఎండిబి కుంభకోణం కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో మంగళవారం తీర్పునిచ్చిన మలేషియా కోర్టు రజాక్‌ను […]

Update: 2020-07-28 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు జైలు శిక్ష అనుభవించడం అరుదు. కానీ, ఓ దేశ మాజీ ప్రధానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఓ కేసులో దోషిగా తెలడంతో అక్కడి న్యాయస్థానం 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌.. 1 ఎండిబి కుంభకోణం కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో మంగళవారం తీర్పునిచ్చిన మలేషియా కోర్టు రజాక్‌ను దోషిగా తేల్చుతూ 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణంలో బిలియన్ల డాలర్ల కుంభకోణం జరిగినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంతోనే 2018లో నజీబ్‌ పార్టీని అధికారం నుంచి తొలగించారు. నజీబ్‌ రజాక్ మొత్తం 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని.. ఇందులో అన్ని ఆరోపణల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ మొహమ్మద్ నజ్లాన్ గజాలి స్పష్టం చేశారు.

Tags:    

Similar News