కరోనా కంటే కేసీఆరే ప్రమాదం : విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంటే సీఎం కేసీఆరే ప్రమాదకరమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఒక బక్కజీవిని కొట్టడానికి ఇంత మంది కేంద్ర మంత్రులు, బడా నేతలు రావాలా అని సీఎం ప్రశ్నిస్తున్నారని, ఆయన మాటలు విడ్డూరంగా ఉందని విజయశాంతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంటే సీఎం కేసీఆరే ప్రమాదకరమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఒక బక్కజీవిని కొట్టడానికి ఇంత మంది కేంద్ర మంత్రులు, బడా నేతలు రావాలా అని సీఎం ప్రశ్నిస్తున్నారని, ఆయన మాటలు విడ్డూరంగా ఉందని విజయశాంతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుంది?
— VijayashanthiOfficial (@vijayashanthi_m) November 28, 2020
“కేసీఆర్ గారి మాటలు వింటుంటే.. ప్రపంచాన్ని కుదిపేస్తున్నకరోనా వైరస్ కూడా కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుద ముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది” అని విజయశాంతి పేర్కొన్నారు.
ఇతర పార్టీలు గెలిస్తే భూమి తలకిందులైపోతుందా?
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులై పోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ అరిచి గీపెడుతున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు. “సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి అధికారం ఎలా దక్కుతుంది? ” అని ఆమె తన ఫేస్ బుక్ పోస్టులో ప్రశ్నించారు.