నకిరేకల్‌లో దారుణం… చలించిన మాజీ ఎమ్మెల్యే

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బాధితుల, మృతుల పట్ల వివక్ష చూపడం సరికాదని ప్రభుత్వం, పోలీసులు ఎంత చెప్పినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. సొంత కుటుంబ సభ్యులపైనే వివక్ష చూపుతూ, మానవత్వాని మంటగలుపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి మూలంగా ఓ వ్యక్తి మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు మృతదేహాన్ని బయటవదిలి వెళ్లిపోయారు. గమనించిన గ్రామస్తులు మృతదేహం చట్టూ రాళ్లను అడ్డుగా […]

Update: 2020-09-12 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బాధితుల, మృతుల పట్ల వివక్ష చూపడం సరికాదని ప్రభుత్వం, పోలీసులు ఎంత చెప్పినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. సొంత కుటుంబ సభ్యులపైనే వివక్ష చూపుతూ, మానవత్వాని మంటగలుపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి మూలంగా ఓ వ్యక్తి మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు మృతదేహాన్ని బయటవదిలి వెళ్లిపోయారు. గమనించిన గ్రామస్తులు మృతదేహం చట్టూ రాళ్లను అడ్డుగా పెట్టి, స్థానిక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వీరేశం అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వం చాటుకున్నారు.

Tags:    

Similar News