మాజీ ఎమ్మెల్యే కరోనాతో మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, 1984 సిక్కుల అల్లర్లలో దోషి మహేందర్ యాదవ్(70) ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో కన్నుమూశారు. ఢిల్లీ మండోలి జైలులో పదేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న మహేందర్ యాదవ్‌కు గతనెల 26న కరోనా పాజిటివ్‌గా తేలింది. 30న అతన్ని కుటుంబీకులు ద్వారకలోని ఆకాశ్ హెల్త్‌కేర్ హాస్పటిల్‌ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన మరణించారు. జైలులో మహేందర్ యాదవ్‌‌తో పాటు మర్డర్ కేసు దోషి కన్వర్ సింగ్ సహా […]

Update: 2020-07-05 08:16 GMT

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, 1984 సిక్కుల అల్లర్లలో దోషి మహేందర్ యాదవ్(70) ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో కన్నుమూశారు. ఢిల్లీ మండోలి జైలులో పదేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న మహేందర్ యాదవ్‌కు గతనెల 26న కరోనా పాజిటివ్‌గా తేలింది. 30న అతన్ని కుటుంబీకులు ద్వారకలోని ఆకాశ్ హెల్త్‌కేర్ హాస్పటిల్‌ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన మరణించారు. జైలులో మహేందర్ యాదవ్‌‌తో పాటు మర్డర్ కేసు దోషి కన్వర్ సింగ్ సహా 30 మంది ఒకే బారాక్‌లో ఉంచారు. గత నెల 15న కన్వర్ సింగ్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనాతో మరణించిన రెండో ఖైదీ మహేందర్ యాదవ్ కావడం గమనార్హం.

Tags:    

Similar News