బీజేపీకి బిగ్ షాక్.. మోత్కుపల్లి రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బండి సంజయ్‌కు లేఖ రాశారు. ఈటల రాజేందర్‌‌ను పార్టీలోకి చేర్చుకోవడం తనను ఇబ్బందికి గురి చేసిందని ఆ లేఖలో అసలు నిజం చెప్పారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తెలంగాణ బీజేపీ నేతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం. ఈటలపై సంచలన […]

Update: 2021-07-23 01:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బండి సంజయ్‌కు లేఖ రాశారు. ఈటల రాజేందర్‌‌ను పార్టీలోకి చేర్చుకోవడం తనను ఇబ్బందికి గురి చేసిందని ఆ లేఖలో అసలు నిజం చెప్పారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తెలంగాణ బీజేపీ నేతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం.

ఈటలపై సంచలన ఆరోపణలు..

రాజీనామా వ్యవహారంపై స్పందించిన మోత్కుపల్లి ఈటలను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఈటలకు అంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దళితుల భూమిని ఆక్రమించుకున్నారని.. దేవాలయ భూమి ఆయన ఆధీనంలో ఉందన్నారు. ఈటలను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు మోత్కుపల్లి. అవినీతి పరుడైన ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో దళితుల మనోభావాలను నాయకత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ దళితుల పట్ల ప్రేమ కనబరుస్తున్నారని మోత్కుపల్లి కొనియాడారు.

బండి సంజయ్‌కు లేఖ..

‘ఎన్నో ఉత్ర్కష్ట పరిణామాల మధ్య దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిణామాలకనుగుణంగా.. రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకు భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకొని ఆ పార్టీలో చేరడమైనది. కానీ, నా అనుభవాన్ని, సుధీర్గ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఐనా నాకు పార్టీలో సముచిత స్థానం కల్పించకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. కనీసం కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదు. నా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని నాకు అవకాశాలు కల్పించడంలో పార్టీ విఫలం చెందిందని భావించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి నా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తేనే తమరికి చెప్పి వెళ్లడం జరిగింది. దాని గురించి పార్టీలో భిన్నాభిప్రాయాలు బహిర్గతం కావడం నన్ను బాధించాయి. అంతేకాకుండా, ఇటీవల ఈటల రాజేందర్‌ను పార్టీలోకి చేర్చుకునే విధానం కూడా నన్ను బాధించింది. ఎస్సీ వర్గాల భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నందుకు.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పార్టీలో చేర్చుకున్న అంశం, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈటల రాజేందర్‌ను చేర్చుకోవడం కూడా నన్ను ఇబ్బందికి గురిచేసింది. పార్టీ నన్ను, నా అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే నన్ను దూరం పెట్టడం బాధాకరంగా భావిస్తున్నాను.. అందుకోసం నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అంటూ మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సంచలన లేఖ రాశారు.

Tags:    

Similar News