తండ్రి ఫ్రీ కరెంట్ ఇస్తే.. కొడుకు మీటర్లు పెట్టవట్టే!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అధికార పార్టీ నేతల పనితీరుపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గరం అయ్యారు. వైసీపీ నేతలకు పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి, హామీల అమలులో లేదని విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేస్తే.. జగన్ సీఎం అయ్యాక కరెంట్ మీటర్లు ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. వరదల వలన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తంచేశారు. […]

Update: 2020-10-08 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో అధికార పార్టీ నేతల పనితీరుపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గరం అయ్యారు. వైసీపీ నేతలకు పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి, హామీల అమలులో లేదని విమర్శించారు. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేస్తే.. జగన్ సీఎం అయ్యాక కరెంట్ మీటర్లు ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. వరదల వలన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ వరదల సమయంలో గతేడాది నంద్యాలకు వచ్చి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, ఇంత వరకు రైతులకు పరిహారం అందలేదని గుర్తుచేశారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు మూతబడ్డాయని, వైఎస్సాఆర్ జలకళ పథకం కింద ఉచితంగా బోర్‌లు వేయడంపై ఇంత వరకూ గైడ్ లెన్స్ రాలేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీటర్లు ఏర్పాటు చేయమని చెప్పిందని కానీ, ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగించి రైతులకు తీరని అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఆ మంత్రిపై చర్యలేవి?

‘మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మంత్రులే అవినీతికి పాల్పడితే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. మంత్రి అవినీతి అక్రమాలపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 270 ఎకరాలు స్కామ్ జరగడం వల్ల రైతులు పొలాల్లోకి వెళ్లడం లేదు. మంత్రి జయరాంపై విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News