కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనుప్ చంద్ర పాండే నియామకం

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా 1984 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనుప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఈయన ఎన్నికల కమిషన్‌ ప్యానెల్లో మూడేళ్లలోపు పదవిలో కొనసాగనున్నారు. ఫిబ్రవరి 2024లో పాండే 65 ఏళ్ల వయోపరిమితి పూర్తి చేసుకోనుండటంతో పదవీ విరమణ పొందనున్నారు. 12 ఏప్రిల్ 2021న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా పదవీ విరమణ పొందనున్నందున ఆ స్థానంలో తరువాతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర […]

Update: 2021-06-09 01:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా 1984 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనుప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఈయన ఎన్నికల కమిషన్‌ ప్యానెల్లో మూడేళ్లలోపు పదవిలో కొనసాగనున్నారు. ఫిబ్రవరి 2024లో పాండే 65 ఏళ్ల వయోపరిమితి పూర్తి చేసుకోనుండటంతో పదవీ విరమణ పొందనున్నారు.

12 ఏప్రిల్ 2021న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా పదవీ విరమణ పొందనున్నందున ఆ స్థానంలో తరువాతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు అనుప్ చంద్ర పాండే ఎన్నికల ప్యానెల్‌లో మూడో సభ్యుడిగా కొనసాగనున్నారు. పాండే నియామకంతో ముగ్గురు సభ్యుల కమిషన్‌‌కు బలం చేకూరనున్నట్లు కేంద్రం భావించింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్రం ముందుగానే ఎన్నికల కమిషన్‌‌లో ఏర్పడే ఖాళీని భర్తీ చేసింది. కాగా, అనుప్ చంద్ర పాండేకు గతంలో యూపీ చీఫ్ సెక్రెటరీ, రక్షణ శాఖ అడిషనల్ సెక్రెటరీ, కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీగా పనిచేసిన అనుభవం ఉంది.

Tags:    

Similar News