ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు.. ఓ ‘చెల్లని రూపాయి’

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, రెండవ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. తాజాగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ‘చెల్లని రూపాయి’ అని కడియం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించడమే కాకుండా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Update: 2021-03-21 05:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, రెండవ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. తాజాగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ‘చెల్లని రూపాయి’ అని కడియం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దీనిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించడమే కాకుండా ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కడియం శ్రీహరికి మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉందన్నారు. ఎవరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రజల్లో తనకు ప్రత్యేక స్థానం ఉందని రాజయ్య చెప్పుకొచ్చారు. కడియం వ్యాఖ్యలపై తాను స్పందించనని, హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టంచేశారు. రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు వాళ్లకుంటాయ రాజయ్య వివరించారు.

Tags:    

Similar News