ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడించారు. 1975 ఐఏఎష్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించన తరుణంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు స‌హా ప‌లువురు ముఖ్యమంత్రుల‌కు కార్యద‌ర్శిగా ప‌నిచేసిన ఎస్వీ ప్రసాద్.. […]

Update: 2021-05-31 21:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడించారు. 1975 ఐఏఎష్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించన తరుణంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు స‌హా ప‌లువురు ముఖ్యమంత్రుల‌కు కార్యద‌ర్శిగా ప‌నిచేసిన ఎస్వీ ప్రసాద్.. నిబ‌ద్ధత క‌లిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గా ప్రసాద్ పనిచేశారు.

Tags:    

Similar News