ఈటలను తిట్టించేందుకే కౌశిక్ రెడ్డిని కేసీఆర్ వాడుకున్నాడు- మాజీ ఎంపీ
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లు రవి హాజరై మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ.. చదువుకోవడానికి, ఉద్యోగాల్లో, పొలిటికల్ గా దళిత, గిరిజనులకు […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లు రవి హాజరై మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ.. చదువుకోవడానికి, ఉద్యోగాల్లో, పొలిటికల్ గా దళిత, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దళితులకు రూ.65వేల కోట్లు బడ్జెట్ పెట్టి ఒక్క రూపాయ ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఇలాంటి కేసీఆర్ ఇప్పుడు రూ.2వేల కోట్లతో దళితబంధు అంటూ మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారని, సీఎం కేసీఆర్ ప్లెక్సీలను పాలాభిషేకం చేసుకోవడానికే సంక్షేమ పథకాలు పెడుతున్నారని అన్నారు.
ఈటలను తిట్టించేందుకే కౌశిక్ రెడ్డిని వాడుకొని పార్టీలో చేర్చుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇలాంటి కుట్రలతో రాజకీయం చేసే కేసీఆర్ కు గిన్నిస్ బుక్ లో చేర్చాలని విమర్శించారు. దళిత, గిరిజన, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులు, నాయకులు 3ఎకరాల భూమి ఇస్తే ఆత్మగౌరవం పెరుగుతుందని భావిస్తున్నారని, దళిత బంధుతో ఆత్మ గౌరవం దెబ్బ తీయడమేనని స్పష్టం చేస్తున్నారు. రాష్టంలోని ఎంత మంది దళితులకు ఎంత భూమి కావాలో ప్రభుత్వం చెప్పితే ఆ భూమిని చూపించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. అందుకు అయ్యో నగదును విడుదల చేయాలని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి..
కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని చెప్పే ప్రతిపక్షాలకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు దిమ్మతిరుగుతుందని జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 స్పీడ్ తో దూసుకెళ్తుదని అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. పీసీసీ తీసుకునే ప్రతి కార్యక్రమం తుచా తప్పకుండా విజయవంతం చేయాలన్నారు. దీంతో కష్టపడే వారిని కాపాడుకుంటాము.. నష్టం చేసేవారిని పార్టీ నుంచి పంపిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో… కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వసంత్, జ్ఞానేశ్వర్, జైపాల్ రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.