ఆ హీరోయిన్ని అడ్డుగా పడుకోబెడితే చాలు.. మాజీ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాలు అన్నాకా అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిపై ఇంకొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఎంత ప్రతి పక్షమైన ఒక మహిళా ఎంపీని, అందులోను ఒక సీనియర్ నటిని అసభ్యకరమైన మాటలతో దూషించడం అనేది పెద్ద తప్పు. తాజాగా కర్ణాటక లో మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కోవడమే కాక అధికార ప్రతిపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. ప్రముఖ […]
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాలు అన్నాకా అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిపై ఇంకొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఎంత ప్రతి పక్షమైన ఒక మహిళా ఎంపీని, అందులోను ఒక సీనియర్ నటిని అసభ్యకరమైన మాటలతో దూషించడం అనేది పెద్ద తప్పు. తాజాగా కర్ణాటక లో మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కోవడమే కాక అధికార ప్రతిపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలతపై కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో తీవ్ర కలకలం రేపాయి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని సుమలత ఫైర్ అయ్యారు.
సుమలత ఎంపీగా ఉన్నా మాండ్య జిల్లాలోని ప్రఖ్యాత కృష్ణరాజసాగర (కేఆర్ఎస్) డ్యామ్ గేట్లు లీక్ అవుతున్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇక ఈ విషయమై ఇటీవల సుమలత మాట్లాడుతూ కృష్ణరాజసాగర జలాశయం చుట్టూ అక్రమంగా గనుల తవ్వకంతోపాటు ఇసుక దందా కొనసాగుతోందని, వాటి వలెనే పగుళ్లు ఏర్పడి డ్యామ్ గేట్లు లీక్ అవుతున్నాయని ఆరోపించింది. ఇక తాజాగా దీనిపై స్పందించిన మాజీ సీఎం కుమారస్వామి “కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజీని అరికట్టడానికి ఎంపీ సుమలతను అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని” దారుణ వ్యాఖ్యలుచేశారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో మంటలు రేపాయి. ఒక బాధ్యతాయుత పదవిని చేపట్టి, ఇన్నేళ్లు ప్రజలకు సేవ చేసిన ఒక వ్యక్తి ఓ మహిళా ఎంపీ ని ఈ విధంగా కించపరచడం ఏంటని..? దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపై సుమలత ఫైర్ అయ్యారు. “ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేనివారు సీఎంగా ఎలా పనిచేశారు.. నేను కూడా ఆయనలా స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు నాకు తేడా ఏముంటుంది.. ఒక మహిళపై వ్యక్తిగత దాడికి దిగుతున్నాడు. మాండ్యలో అక్రమ మైనింగ్‌లో పాల్పడిన వారిలో ఎవరున్నారనేది బహిరంగ రహస్యం” అంటూ మండిపడింది. ఇక మొన్నటి మాండ్య ఎంపీ ఎన్నికల్లో కుమార స్వామి కుమారుడు నిఖిల్ ని సుమలత ఓడించిందన్న కోపంతోనే మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా ఒక మహిళా ఎంపీ పై నోరుజారి మాజీ సీఎం మరోసారి చిక్కులు కొనితెచ్చుకున్నాడు.