వేటాడితే కఠిన శిక్షలు తప్పవు.. ఫారెస్ట్ అధికారుల వార్నింగ్
దిశ, ములుగు: వన్యప్రాణులను వేటాడేవారికి అటవీశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించే పనిలో పడ్డారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పులి వేటకు బలైన విషయం తెలిసిందే. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుల్లో పెద్దపులి చిక్కుకుని మరణించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు వన్యప్రాణులను వేటాడుతున్నట్లుగా అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు కౌన్సెలింగ్ చేపడుతోంది. అలాగే వన్యప్రాణులను […]
దిశ, ములుగు: వన్యప్రాణులను వేటాడేవారికి అటవీశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించే పనిలో పడ్డారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పులి వేటకు బలైన విషయం తెలిసిందే. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చుల్లో పెద్దపులి చిక్కుకుని మరణించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు వన్యప్రాణులను వేటాడుతున్నట్లుగా అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు కౌన్సెలింగ్ చేపడుతోంది. అలాగే వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి వస్తుందో కూడా వారికి వివరిస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ములుగు జిల్లా వ్యాప్తంగా అడవులల్లో నివాసం ఉంటున్న గుత్తికోయ గుంపులలో, గుడాలలో అటవీశాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపడుతోంది. విల్లులు, బాణాలు, గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నారు. పులి జాడలు తెలిసినచో అటవీశాఖ మరియు పోలీసు శాఖ అధికారాలకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా వేకువజామున మరియు రాత్రి అడవిలోనికి వెళ్లొద్దని హెచ్చరించారు. 4 డివిజన్లలో ఉన్న దాదాపుగా ఇప్పటికే 30 గుత్తికోయ గుంపులలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం పూర్తియ్యాయని అధికారులు తెలిపారు.