అటవీ ఉద్యోగులూ ఫ్రంట్ లైన్ వారియర్సే..

దిశ,తెలంగాణ బ్యూరో : అడవుల్లో విధులు నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాల నివారణ, వేట, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణకు పాటుపడుతున్న అటవీ సిబ్బందిని కూడా ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అటవీ సంరక్షులుగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది […]

Update: 2021-04-09 08:20 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : అడవుల్లో విధులు నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాల నివారణ, వేట, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణకు పాటుపడుతున్న అటవీ సిబ్బందిని కూడా ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అటవీ సంరక్షులుగా ఉన్న అటవీ శాఖ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది వ్యాక్సినేషన్ లో పాల్గొన్నారు.

పీసీసీఎఫ్ శోభ మాట్లాడుతూ అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే అటవీ సంపదతో పాటు, వన్యప్రాణుల రక్షణకు వీలవుతుందని (పీసీసీఎఫ్) అన్నారు. క్షేత్రస్థాయిలో తగిన కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని విధులకు హాజరు కావలసిందిగా కోరారు. క్షేత్ర స్థాయి సిబ్బందితోపాటు, వివిధ బేస్ క్యాంపుల్లో విధులు నిర్వర్తిస్తున్న వాచర్లకు కూడా వాక్సిన్ ఇప్పించాల్సిందిగా అన్ని జిల్లాల అటవీ అధికారులను మంత్రి కోరారు.

Tags:    

Similar News