శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత..

దిశ, శంషాబాద్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం షార్జా నుండి ఇండిగో (6E-1405) విమానంలో ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. అతనిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ప్రయాణికుని లగేజ్ బ్యాగులో ఉన్న 25,000 సౌదీ అరేబియా రియాల్స్, 22,500 దినామ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 8,00,795 […]

Update: 2021-12-22 09:22 GMT

దిశ, శంషాబాద్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం షార్జా నుండి ఇండిగో (6E-1405) విమానంలో ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. అతనిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ప్రయాణికుని లగేజ్ బ్యాగులో ఉన్న 25,000 సౌదీ అరేబియా రియాల్స్, 22,500 దినామ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 8,00,795 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోని, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News