పరీక్షలు లేకుండానే పైచదువులకు

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్‌ కోసం అవసరమైన 29 ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈకి సూచించినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ తెలిపారు. హెచ్‌ఈఐలో ప్రవేశాల కోసం ఆ పరీక్షలు కీలకమైనవని చెప్పారు. మిగతా సబ్జెక్టులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై […]

Update: 2020-04-01 22:28 GMT

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్‌ కోసం అవసరమైన 29 ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈకి సూచించినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ తెలిపారు. హెచ్‌ఈఐలో ప్రవేశాల కోసం ఆ పరీక్షలు కీలకమైనవని చెప్పారు.

మిగతా సబ్జెక్టులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై బోర్డు విడిగా ఆదేశాలు జారీ చేస్తుందని తెలపారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ప్రాజెక్టులు, పీరియడిక్‌ టెస్టులు, టర్మ్‌ ఎగ్జామ్స్‌ ఫలితాల ఆధారంగా 9,11వ తరగతి విద్యార్థులను నేరుగా ప్రమోట్‌ చేయాలని సూచించింది.

Tags: CBSE,no exams,next classes,central minister ramesh

Tags:    

Similar News