టెలికాం రంగం పై పన్నులు తగ్గించండి : సునీల్ మిట్టల్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21 వేల కోట్ల నిధులను సేకరించి 5జీ సేవలు, ఫైబర్, డేటా సెంటర్ విభాగంలో పెట్టుబడులను సాధిస్తుందని కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. పెట్టుబడులను వేగవంతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మరింత బలోపేతం అవుతామని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దేశీయ టెలికాం రంగంలో నిరంతర పెట్టుబడులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, తద్వారా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21 వేల కోట్ల నిధులను సేకరించి 5జీ సేవలు, ఫైబర్, డేటా సెంటర్ విభాగంలో పెట్టుబడులను సాధిస్తుందని కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. పెట్టుబడులను వేగవంతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మరింత బలోపేతం అవుతామని సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దేశీయ టెలికాం రంగంలో నిరంతర పెట్టుబడులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, తద్వారా పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సునీల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము రూ. 100 సంపాదిస్తే అందులో రూ. 35 ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
టెలికాం రంగంపై ప్రభుత్వ విధించే పన్నులు అధికంగా ఉన్నాయని, ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలతో టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని సునీల్ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ భారం తగ్గుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇంకో ఏడాదిలో దేశీయంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, 2022-23లో పూర్తిగా అందరికీ వినియోగంలో రానున్నట్టు చెప్పారు. 5జీ సేవలు అందుబాటు ధరల్లోనే ఉండనున్నాయని, 5జీ ఫోన్‌ల వినియోగదం ద్వారా ఇది సాధ్యమని సునీల్ మిట్టల్ చెప్పారు. దీనికోసం టెలికాం కంపెనీలు నెలకు రూ. 200 ఆర్పు(వినియోగదారు సగటు ఆదాయం) లక్ష్యంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.