బ్యాంకుల వద్ద చెప్పుల క్యూ..

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి భారత్ సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.500, రూ.1,500 సాయం అందించాయి. అయితే, వాటిని బ్యాంకుల్లో నుంచి తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. క్యూలో తమకు బదులుగా పొద్దునే చెప్పులు, రాళ్లను గుర్తుగా పలువురు పెడుతున్నారు. ఇటీవల జన్ ధన్ ఖాతాదారులు కేంద్రం […]

Update: 2020-04-16 23:17 GMT

దిశ, హైదరాబాద్ :
కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి భారత్ సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.500, రూ.1,500 సాయం అందించాయి. అయితే, వాటిని బ్యాంకుల్లో నుంచి తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. క్యూలో తమకు బదులుగా పొద్దునే చెప్పులు, రాళ్లను గుర్తుగా పలువురు పెడుతున్నారు.

ఇటీవల జన్ ధన్ ఖాతాదారులు కేంద్రం నుంచి సాయం పొందగా..ఇప్పుడు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1,500ల కోసం రెండ్రోజులుగా బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు ఉదయం 10.30 గంటలకు ఓపెన్ చేస్తారు. కానీ, పొద్దున 7 గంటలకే బ్యాంకుల వద్దకు ఖాతాదారులు క్యూ లో నిల్చోడానికి వస్తున్నారు. బ్యాంకు తెరిచే సమయం ఉండటంతో వారికి బదులుగా వారి చెప్పులను క్యూలో పెడుతున్నారు. కొందరైతే గుర్తుగా రాళ్లను ఉంచుతున్నారు. అయితే, సామాజిక దూరం పాటించాలని బాక్సులు గీసిన నేపథ్యంలో ఆ బాక్సుల్లో పలువురు చెప్పులు, రాళ్లు పెడుతుండటం గమనార్హం.

Tags: Footwear Queue, Banks, money, from state, central govt, customers

Tags:    

Similar News