వర్షం కాదు.. ‘ఉసిల్లు’ దండయాత్ర చేశాయి
దిశ, కరీంనగర్ సిటీ : సాధారణంగా వర్షాకాలంలో లైట్ వెలుతురుకు మాత్రమే ఉసిల్లు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. కానీ, కరీంనగర్ శివారు ప్రాంతంలో వేసవిలోనూ విలయతాండవం చేస్తున్నాయి. అల్గునూరు సమీపంలోని డి86 కెనాల్ బ్రిడ్జ్ పై ఉసిల్లు బీభత్సం సృష్టించాయి. రహదారిపై వచ్చి పోయే వాహనాలను అడ్డుకున్నాయి. ఆగనివారిపై జుమ్మంటు దూసుకుపోయి.. రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. కాగా, ఇది అక్కడ మామూలే అంటూ అలవాటైన దులుపుకుని వెళ్లిపోయారు. నిమిషానికి యాబైకి పైగా వాహనాలు వెళ్లే ఈ రహదారిపై […]
దిశ, కరీంనగర్ సిటీ : సాధారణంగా వర్షాకాలంలో లైట్ వెలుతురుకు మాత్రమే ఉసిల్లు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. కానీ, కరీంనగర్ శివారు ప్రాంతంలో వేసవిలోనూ విలయతాండవం చేస్తున్నాయి. అల్గునూరు సమీపంలోని డి86 కెనాల్ బ్రిడ్జ్ పై ఉసిల్లు బీభత్సం సృష్టించాయి. రహదారిపై వచ్చి పోయే వాహనాలను అడ్డుకున్నాయి. ఆగనివారిపై జుమ్మంటు దూసుకుపోయి.. రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. కాగా, ఇది అక్కడ మామూలే అంటూ అలవాటైన దులుపుకుని వెళ్లిపోయారు. నిమిషానికి యాబైకి పైగా వాహనాలు వెళ్లే ఈ రహదారిపై ఒక్కసారిగా ఉసిల్లు దండయాత్ర చేయడంతో.. బెంబేలెత్తిన వాహనదారులు సడెన్ బ్రేకులు వేయటం, వారి వెనుక వచ్చే వాహనాలు ముందు వాటిని ఢీ కొని.. పదికి పైగా చిన్న ప్రమాదాలు జరిగాయి.