ఉధృతంగా కృష్ణమ్మ పరవళ్లు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,86,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 3,69,690 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు గానూ, ప్రస్తుతం 318.010 అడుగుల ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 9.57 టీఎంసీల […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,86,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 3,69,690 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు గానూ, ప్రస్తుతం 318.010 అడుగుల ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 9.57 టీఎంసీల నీటికి.. ప్రస్తుతం 8.631 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.