అంతులేని విషాదం.. వరదలో కొట్టుకుపోయిన ‘పెళ్లి కొడుకు నానమ్మ, రూ.30 లక్షలు’..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వలన అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అన్నమయ్య రిజర్వాయర్ తెగిపోవడంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుని పోయాయి. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇకపోతే చిత్తూరు జిల్లాలోని చేయ్యెరులో వరదల కారణంగా ఆదివారం జరగాల్సిన అమర్‌ నాథ్ పెళ్లి ఆగిపోయింది. వరదల కారణంగా పెళ్లి కోసం దాచుకున్న రూ.30లక్షల నగదు, బంగారం కొట్టుకుని పోయాయి. అదే విధంగా పెళ్లి […]

Update: 2021-11-21 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వలన అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అన్నమయ్య రిజర్వాయర్ తెగిపోవడంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుని పోయాయి. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇకపోతే చిత్తూరు జిల్లాలోని చేయ్యెరులో వరదల కారణంగా ఆదివారం జరగాల్సిన అమర్‌ నాథ్ పెళ్లి ఆగిపోయింది. వరదల కారణంగా పెళ్లి కోసం దాచుకున్న రూ.30లక్షల నగదు, బంగారం కొట్టుకుని పోయాయి.

అదే విధంగా పెళ్లి కొడుకు నానమ్మ సావిత్రమ్మ (75) కూడా వరద ప్రవాహంలో కొట్టుకుని పోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభకార్యం ఆగిపోగా, ఎంతో కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో పాటు ఇంటి పెద్ద కూడా ప్రకృతి ప్రకోపానికి బలవ్వడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇకపోతే ఈ వరద ప్రవాహంలో వెయ్యికి పైగా పశువులు, 500లకు పైగా దూడలు, రూ.3లక్షల వేల విలువైన కోళ్లు కూడా వరదల్లో కొట్టుకుని పోయినట్టు సమాచారం. భారీ వరదల కారణంగా పలు ఇండ్లు నేలమట్టం అవ్వగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News