ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ భరోసా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా జీతాలు కట్ చేయమని, వారి ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కరలేదని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి 6 వేల మంది ఉన్న తమ ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని తెలిపారు. తమ సంస్థకు ఆర్థిక పరమైన ఇబ్బందులేమీ లేవని జీతాల్లో కోత అనే ప్రసక్తే లేదని స్పష్టం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా జీతాలు కట్ చేయమని, వారి ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కరలేదని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి 6 వేల మంది ఉన్న తమ ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని తెలిపారు. తమ సంస్థకు ఆర్థిక పరమైన ఇబ్బందులేమీ లేవని జీతాల్లో కోత అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారికి కూడా జీతాలిస్తామని వివరించారు. ఉద్యోగులెవరూ భయపడాల్సిన పనిలేదని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉండాలని, వారి ఆరోగ్యం బాగుండేలా చూసుకునే బాధ్యత తమదేనని కళ్యాణ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో కిరాణా దుకాణ యాజమాన్యంతో కలిసి పనిచేసి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రపంచదేశాలన్నిటికీ కోవిడ్-19 వ్యాప్తి చెందడంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో పలు రకాల వస్తువులను విక్రయించడాన్ని ఫ్లిప్‌కార్ట్ నిలిపేసింది. అత్యవసరమైన సరుకుల ఆర్డర్లు మాత్రమే తీసుకుంటొంది.
Tags: Flipkart, Coronavirus, covid-19, flipkart no salary cut