సీఎం ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం.. అందుకే పెట్టారా ?

దిశ, ఏపీ బ్యూరో: తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ భద్రతా నేపథ్యంలో అమరారెడ్డి కాలనీని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేసిన వారికి ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించింది. అయితే నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగిందని తమ ఆవేదనను ఫ్లెక్సీలో వెళ్లగక్కారు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారికే ఇళ్ల స్థలాలు మంజూరు […]

Update: 2021-07-18 03:13 GMT

దిశ, ఏపీ బ్యూరో: తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ భద్రతా నేపథ్యంలో అమరారెడ్డి కాలనీని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేసిన వారికి ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించింది. అయితే నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగిందని తమ ఆవేదనను ఫ్లెక్సీలో వెళ్లగక్కారు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారికే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ఆరోపించారు. నిర్వాసితులందరికి ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినా అధికారులు, స్థానిక నాయకులు అమలు చేయడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ గోడు వినాలంటూ సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్, వైసీపీ నాయకులకు ఫ్లెక్సీ రూపంలో బాధితులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News