Ramprasad Reddy: వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫైర్

ఒంగోలు (Ongole)కు చెందిన టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి (Thirty-three Veeraiah Chowdhury) మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Update: 2025-04-23 09:08 GMT
Ramprasad Reddy: వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఒంగోలు (Ongole)కు చెందిన టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి (Thirty-three Veeraiah Chowdhury) మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పద్మ టవర్స్‌ (Padma Towers)లోని తన కార్యాలయంలో ఉన్న ఆయనపై ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో మూకుమ్మడిగా దాడులు చేశారు. దీంతో తీవ్రగాయాల పాలైన వీరయ్య చౌదరి (Veeraiah Chowdary)ని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పయినట్లుగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే వీరయ్య చౌదరి హత్యపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ (TDP) నేత హత్య తనను ఎంతగానే బాధించిందని అన్నారు. హత్యా రాజకీయాను ప్రోత్సహించే వారిని ఇక నుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఈ హత్య విషయంలో నిందితులు ఎంతటి వారైనా తప్పించుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. వైసీపీ నాయకులు (YCP Leaders) మాత్రం ఇంకా రౌడీల్లా చలామణి అవుతూ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ (Liquor Scam)లో ఎంతటి వారు ఉన్నా వదలిపెట్టబోమని హెచ్చిరించారు. భూకబ్జాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి (Peddireddy Ramchandra Reddy) చట్టం నుంచి తప్పించుకోలేరని ధ్వజమెత్తారు. త్వరలోనే మాజీ మంత్రి రోజా (Roja), పెద్దిరెడ్డి (Peddireddy) జైలుకెళ్లడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News