ఐస్‌క్రీమ్ సెల్లర్ అంతిమయాత్ర.. బారులు తీరిన ఐస్‌క్రీమ్ వ్యాన్స్!
దిశ, ఫీచర్స్ : ఆగ్నేయ లండన్‌లో 40 ఏళ్లుగా ఐస్‌క్రీమ్స్ విక్రయిస్తున్న 62 ఏళ్ల హసన్ డెర్విష్ అంతిమయాత్ర ప్రతీ హృదయాన్ని హత్తుకుంది. అతడి అంత్యక్రియలకు ఐస్‌క్రీమ్ ట్రక్కులన్నీ ఊరేగింపుగా వెళ్లడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్థానిక మహిళ ఒకరు అతడి అంతిమ యాత్ర మొత్తాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఐస్‌క్రీమ్ విక్రేత చనిపోతే.. అతడి కార్టేజ్‌లో పాల్గొనడం ఐస్‌క్రీమ్ విక్రేతల సంఘంలో ఒక సంప్రదాయమని మరో సెల్లర్ తెలిపాడు. లండన్‌లోని ఐస్‌క్రీమ్ […]
దిశ, ఫీచర్స్ : ఆగ్నేయ లండన్‌లో 40 ఏళ్లుగా ఐస్‌క్రీమ్స్ విక్రయిస్తున్న 62 ఏళ్ల హసన్ డెర్విష్ అంతిమయాత్ర ప్రతీ హృదయాన్ని హత్తుకుంది. అతడి అంత్యక్రియలకు ఐస్‌క్రీమ్ ట్రక్కులన్నీ ఊరేగింపుగా వెళ్లడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్థానిక మహిళ ఒకరు అతడి అంతిమ యాత్ర మొత్తాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
ఐస్‌క్రీమ్ విక్రేత చనిపోతే.. అతడి కార్టేజ్‌లో పాల్గొనడం ఐస్‌క్రీమ్ విక్రేతల సంఘంలో ఒక సంప్రదాయమని మరో సెల్లర్ తెలిపాడు. లండన్‌లోని ఐస్‌క్రీమ్ సెల్లర్ కమ్యూనిటీకి, ఇతర సంఘాలకు మధ్య తేడాను అతడు ఎత్తి చూపాడు. ఇక హసన్ సోదరుడు సవాష్ తుర్కెల్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. అతన్ని ‘కింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్’గా పేర్కొన్నాడు. ‘2000 సంవత్సరం ప్రారంభంలో లెవిషామ్‌లో ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీని స్థాపించిన హసన్.. అనతి కాలంలోనే ఐస్‌క్రీమ్ మ్యాన్‌గా ప్రాచుర్యం పొందాడని తెలిపాడు. మహమ్మారి సంబంధిత ఆంక్షలు లేకుంటే ఊరేగింపులో మరింత ఎక్కువ మంది చేరిఉండేవారని వెల్లడించాడు.
just witnessed an ice cream man’s funeral and all the ice cream vans came and followed in solidarity I AM SOBBING pic.twitter.com/bJhyJj4JoK
— Louisa Davies (@LouisaD__) December 17, 2021