కశ్మీర్ లో మొదటి కరోనా మృతి.. గోవాలో తొలి కేసు
న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్ లో మొదటి కరోనా మృతి నమోదైంది. శ్రీనగర్ లోని హైదర్ పురకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఈరోజు ఉదయం ప్రభుత్వాసుపత్రిలో చెందాడు. మూడు రోజుల క్రితమే అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ఆయనతో కాంటాక్ట్ అయిన మరో నలుగురికీ కరోనా సోకినట్టు గుర్తించారు. వారిని క్వారంటైన్ లోకి పంపారు. పర్యాటక రాష్ట్రం గోవాలో ఈ రోజు తొలి కరోనా కేసు నమోదైంది. స్పెయిన్, ఆస్ట్రేలియా, […]
న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్ లో మొదటి కరోనా మృతి నమోదైంది. శ్రీనగర్ లోని హైదర్ పురకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఈరోజు ఉదయం ప్రభుత్వాసుపత్రిలో చెందాడు. మూడు రోజుల క్రితమే అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ఆయనతో కాంటాక్ట్ అయిన మరో నలుగురికీ కరోనా సోకినట్టు గుర్తించారు. వారిని క్వారంటైన్ లోకి పంపారు. పర్యాటక రాష్ట్రం గోవాలో ఈ రోజు తొలి కరోనా కేసు నమోదైంది. స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికాలలో పర్యటించినట్టుగా గుర్తించిన ముగ్గురిలో ఈ మహమ్మారి ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో గోవాలో తొలిసారిగానే మూడు కేసులు నమోదు అయ్యాయి.
Tags: Coronavirus, first case, death, kashmir, goa, travel