ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు

సియోల్: ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానితుడిని గుర్తించగానే సరిహద్దు పట్టణం కీసంగ్‌ను లాక్‌డౌన్ చేశారు. ఈ దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసునూ గుర్తించలేదు. తొలిసారిగా వారి దేశంలో ఒక కరోనా అనుమానితుడిని గుర్తించింది. ఆ అనుమానితుడు కూడా పొరుగుదేశం దక్షిణ కొరియా నుంచి అక్రమంగా చొరబడి ఉండొచ్చని అనుమానిస్తున్నది. ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం అత్యవసర పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించి టాప్ క్లాస్ అలర్ట్ ప్రకటించారు. ఈ […]

Update: 2020-07-26 03:50 GMT

సియోల్: ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానితుడిని గుర్తించగానే సరిహద్దు పట్టణం కీసంగ్‌ను లాక్‌డౌన్ చేశారు. ఈ దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసునూ గుర్తించలేదు. తొలిసారిగా వారి దేశంలో ఒక కరోనా అనుమానితుడిని గుర్తించింది. ఆ అనుమానితుడు కూడా పొరుగుదేశం దక్షిణ కొరియా నుంచి అక్రమంగా చొరబడి ఉండొచ్చని అనుమానిస్తున్నది.

ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం అత్యవసర పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించి టాప్ క్లాస్ అలర్ట్ ప్రకటించారు. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఉండొచ్చని కిమ్ అన్నారు. కీసంగ్ పట్టణంలో అనుమానితుడిని గుర్తించగానే క్వారంటైన్‌లో ఉంచి పట్టణమంతా లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రవేశించి ఉంటే విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదమున్నదని అధికారులు తెలిపారు. ఎటువంటి అంటువ్యాధినైనా ఎదుర్కొనే ఆరోగ్యవ్యవస్థ నార్త్ కొరియాలో సంసిద్ధంగా లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News