పేటెంట్ హక్కులు పొందిన ‘కాన్‌సినో’ టీకా

న్యూఢిల్లీ: రష్యా ప్రకటించిన స్పుత్నిక్-వీ (Sputnik-vi) తర్వాత చైనాలో రెండో టీకా పేటెంట్ హక్కుల అనుమతి పొందింది. ప్రపంచంలో తొలి టీకాను అభివృద్ధి చేసినట్టు గతవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్-వీ (Sputnik-vi) టీకాను రిజిస్టర్ చేసినట్టు ఆయన తెలిపారు. తాజాగా, చైనాలోని కాన్‌సినో బయలాజిక్స్ కంపెనీ (Biologics Company)అభివృద్ధి చేస్తున్న ఏడీ5-ఎన్‌కొవ్ టీకా (AD5-Encov vaccine)కు ఆ దేశ రెగ్యులేటరీ పేటెంట్ హక్కుల (Regulatory patent rights)ను ఆమోదించింది. పేటెంట్ […]

Update: 2020-08-17 08:44 GMT

న్యూఢిల్లీ: రష్యా ప్రకటించిన స్పుత్నిక్-వీ (Sputnik-vi) తర్వాత చైనాలో రెండో టీకా పేటెంట్ హక్కుల అనుమతి పొందింది. ప్రపంచంలో తొలి టీకాను అభివృద్ధి చేసినట్టు గతవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్-వీ (Sputnik-vi) టీకాను రిజిస్టర్ చేసినట్టు ఆయన తెలిపారు.

తాజాగా, చైనాలోని కాన్‌సినో బయలాజిక్స్ కంపెనీ (Biologics Company)అభివృద్ధి చేస్తున్న ఏడీ5-ఎన్‌కొవ్ టీకా (AD5-Encov vaccine)కు ఆ దేశ రెగ్యులేటరీ పేటెంట్ హక్కుల (Regulatory patent rights)ను ఆమోదించింది. పేటెంట్ హక్కులు (patent rights) పొందిన తొలి చైనా టీకా ఇదే కావడం గమనార్హం. మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్న ఈ టీకా తొలి రెండు దశల ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలువచ్చాయని లాన్సెట్ జర్నల్‌లో కథనం ప్రచురించింది. చివరి దశ ట్రయల్స్‌కు ముందే చైనా ఆర్మీకి ఏడీ5-ఎన్‌కొవ్ టీకా (AD5-Encov vaccine) వేయడానికి జూన్‌లోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం రష్యాలో ఈ టీకా మూడో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా, మెక్సికో, బ్రెజిల్, చిలీలోనూ ప్రారంభం కానున్నాయి. తొలి దశ ట్రయల్స్ ప్రారంభించిన వెంటనే మార్చి 18న పేటెంట్ హక్కుల (patent rights)కోసం కాన్‌సినో రెగ్యులేటరీ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్‌ (Cancino Regulatory National Intellectual Property Administration)కు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 11న అనుమతి లభించినట్టు చైనా మీడియా పేర్కొంది.

చైనాలో ట్రయల్స్ ప్రారంభించిన తొలి టీకా కాన్‌సినో కంపెనీదే అయినప్పటికీ సినోవాక్ బయోటెక్ (Sinovac Biotech), సినోఫామ్ (Sinopham) కంపెనీల టీకాలు అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. పేటెంట్ హక్కుల (patent rights) వార్తలు వెలువడగానే సోమవారం హాంకాంగ్‌లో కాన్‌సినో కంపెనీ షేర్లు 14శాతం, షాంఘై‌లో షేర్లు 6.6శాతం పెరిగాయి.

Tags:    

Similar News