కేరళ సెక్రటేరియట్‌లో మంటలు..

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సచివాలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోగా, ఫర్నీచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై కేరళ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అని ఆరోపించాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని ఆధారాలు నాశనం చేసేందుకు […]

Update: 2020-08-25 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సచివాలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోగా, ఫర్నీచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఘటనపై కేరళ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అని ఆరోపించాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని ఆధారాలు నాశనం చేసేందుకు పినరయి సర్కారు ప్రయత్నించిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నినాదాలు చేస్తూ, సచివాలయం బయట కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News