ఢిల్లీ హాస్పిటల్‌లో మంటలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఓ హాస్పిటల్‌లో అకాస్మతుగా మంటలు వ్యాపించాయి. కరోనా పేషెంట్లకు రిజర్వ్ హాస్పిటల్‌గా ఉపయోగిస్తున్న సైనస్ ఆర్థో కేర్ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్, రికవరీ రూమ్‌లలో మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఎనిమిది ఫైర్ ఇంజిన్‌లతో ఘటనా స్థలికి చేరుకున్నది. మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు అంటుకున్న మూడో అంతస్తులో ఎవరూ లేరనీ, హాస్పిటల్‌లో ఉన్న ఎనిమిది పేషెంట్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం […]

Update: 2020-05-23 10:59 GMT

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఓ హాస్పిటల్‌లో అకాస్మతుగా మంటలు వ్యాపించాయి. కరోనా పేషెంట్లకు రిజర్వ్ హాస్పిటల్‌గా ఉపయోగిస్తున్న సైనస్ ఆర్థో కేర్ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్, రికవరీ రూమ్‌లలో మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఎనిమిది ఫైర్ ఇంజిన్‌లతో ఘటనా స్థలికి చేరుకున్నది. మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు అంటుకున్న మూడో అంతస్తులో ఎవరూ లేరనీ, హాస్పిటల్‌లో ఉన్న ఎనిమిది పేషెంట్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

Tags:    

Similar News